భక్తులతో కిక్కిరిసిన మేడారం

Medaram jatara
Medaram jatara

మేడారం: తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ప్రతి ఏటా ఈ జాతరకు దేశం నలుమూలల నుంచి లక్షల్లో భక్తులు వస్తుంటారు. ప్రతి ఏడు లాగే ఈ సారి కూడా మేడారం జాతరకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. భక్తులతో కిక్కిరిసిన మేడారం జనసంద్రంలా మారింది. జంపన్న వాగులో పుణ్యస్నానాలాచరించిన అనంతరం అమ్మవారికి ఎంతో ప్రీతి అయిన బెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇప్పటికే గద్దెలపైకి చేరుకున్న సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజు చేరుకోగా ఇవాళ సాయంత్రం సమ్మక్క చేరుకోనుంది. ప్రస్తుతం గద్దెల వద్ద క్యూలైన్లలో భక్తులు బారులు తీరి ఉన్నారు. ఇక ఇవాళ సాయంత్రం సమ్మక్క రాకకోసం జిల్లా అధికార యంత్రాంగం చిలకలగుట్ట వద్ద వేచి ఉంది. చిలకలగుట్ట నుంచి సమ్మక్క పూజారులు కుంకుమ భరిణెను తీసుకోని కిందకు వస్తున్న సమయంలో జిల్లా ఎస్‌పి గాల్లోకి కాల్పులు జరుపుతారు. ఈ శబ్దాలే సమ్మక్క రాకకు సంకేతాలు. భారీ బందోబస్తు నడుమ అమ్మవారి కుంకుమ భరిణె చిలకలగుట్ట నుంచి గద్దెల ప్రాంగణానికి తీసుకువస్తారు. ఇక అప్పుడు అసలు మేడారం జాతర మొదలౌతుంది. ఆ మరుక్షణం నుంచి భక్తులు మొక్కుల చెల్లింపులు ప్రారంభమవుతాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/