ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి ఓడిపోవడం ఖాయం

Mamata Banerjee
Mamata Banerjee

కోల్‌కతా: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 8న జరుగనున్న నేపథ్యలో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. నడియాలో మీడియాతో మాట్లాడుతూ..బిజెపిపై తీవ్ర విమర్శలు చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పార్టీ ఘోర పరాజయం పాలవుతుందని ఆమె అన్నారు. మత విద్వేశాలను రెచ్చగొట్టే ఆ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు. గత 12 నెలల కాలంలో ఆ పార్టీ 5 రాష్ర్టాల్లో అధికారం కోల్పోవడమే అందుకు నిదర్శనమని ఆమె తెలిపారు. ఇన్ని రాష్ర్టాల్లో అధికారం కోల్పోయిన ఆ పార్టీకి, పార్టీ పెద్దలకు సిగ్గులేదని ఆమె దుయ్యబట్టారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/