అతి త్వరలో కాంగ్రెస్ లో భారీగా చేరికలు – భట్టి విక్రమార్క

అతి త్వరలో కాంగ్రెస్ లో భారీగా చేరికలు ఉంటాయన్నారు భట్టి విక్రమార్క. బుధువారం పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ తో కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. దాదాపు గంటకు పైగా సమావేశమయ్యారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన భట్టి విక్రమార్క.. రాజగోపాల్ రెడ్డిపై వస్తున్న వార్తలపై సమావేశంలో చర్చించామన్నారు. రాజగోపాల్ రెడ్డి మనస్థానానికి గురైతే ఆయనతో చర్చించి పార్టీలో ఉండేలా మాట్లాడుతామని భట్టి అన్నారు.

రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి మంచి అనుసంధానం ఉందని.. ఆయన కాంగ్రెస్ లో ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అమిత్ షాను కలిశారన్నది యాదృచ్ఛికం అనుకోవచ్చన్నారు. కాంగ్రెస్ , రాహుల్ గాంధీ, సోనియాగాంధీ మీద రాజగోపాల్ రెడ్డికి గౌరవం ఉందన్నారు.

రాజగోపాల్ బిజెపి లో చేరబోతున్నారని బండి సంజయ్ అన్నారని మీడియా అడుగగా..బండి సంజయ్ కు రాజకీయ పరిజ్ఞానం లేదని..ఆయన నోటికి వచ్చినట్లు మాట్లాడుతాడని భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయని.. జీతాలు లేవు, ఉద్యోగాలు లేవు, వరదల సమస్య , డాక్టర్ల కొరత, వైద్య పరంగా సమస్య ఉందన్నారు. గోదావరి, కృష్ణ పరివాహక ప్రాంత ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రజల కోసం రాజకీయాల పార్టీలు పని చేయాలని.. కాంగ్రెస్ ప్రజల కోసం పనిచేస్తుందన్నారు.