పుణే రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం..

పుణే: మహారాష్ట్రలోని పుణేలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పుణేలోని ఔంధ్ ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్ రూఫ్ టాప్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ వాణిజ్య సముదాయం పదో అంతస్తులో ట్రూ ట్రాంప్ ట్రంప్ అనే రెస్టారెంట్ ఉన్నది. బుధవారం తెల్లవారుజామున రెస్టారెంట్ లోపలి భాగంలో మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి రెస్టారెంట్‌ మొత్తం వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఆ ప్రాంతంలో పెద్దఎత్తున పొగలు వ్యాపించాయి.

సమాచారం అందుకున్న అగ్నిపాక సిబ్బంది మంటలను అదుపుచేయడానికి శ్రమిస్తున్నది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. రెస్టారెంట్ గత రెండేండ్లుగా మూతపడి ఉందని వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/