స్వర్ణ ప్యాలెస్ లో భారీ అగ్నిప్రమాదం:ముగ్గురు మృతి

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం ?

Massive fire at Swarna Palace
Massive fire at Swarna Palace

Vijayawada: విజయవాడలోని కొవిడ్ చికిత్సా కేంద్రంలో   భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు.

ఇక్కడి స్వర్ణ ప్యాలెస్ హోటల్ రమేశ్ హాస్పిటల్స్, తమ కరోనా చికిత్సా కేంద్రంగా వినియోగిస్తోంది.

ఈ భవంతిలో   దాదాపు 40 మందికి పైగా కరోనా బాధితులు, 10 మంది వరకూ వైద్య బృందం ఉన్నట్టు తెలుస్తోంది.

మంటలతో భవనమంతా దట్టమైన పొగలు వ్యాపించగా, ఊపిరాడని బాధితులు కిటికీల వద్దకు వచ్చి కేకలు పెట్టారు.

విషయం తెలుసుకున్న అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగి మంటలను అదుపు చేస్తున్నాయి. 

కొందరు బాధితులు ఇప్పటికే సొమ్మసిల్లి పడిపోగా, వారిని లబ్బీపేట, మెట్రోపాలిటన్ హోటల్ కొవిడ్ కేర్ సెంటర్ కు తరలిస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

తాజా ‘నిఘా.వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation/