వైభవంగా రానా,మిహీకా బజాజ్ ల వివాహం
కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ పెళ్లి జరిగింది

నటుడు రానా ఓ ఇంటివాడయ్యాడు. రానా వివాహం తన ప్రేయసి మిహీకా బజాజ్ తో హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోస్ లో ఘనంగా జరిగింది.
కరోనా ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ సెలబ్రిటీల మ్యారేజికి చాలా కొద్దిమంది అతిథులనే పిలిచారు.
అల్లు అర్జున్, సమంత అక్కినేని, రామ్ చరణ్ దంపతులు పెళ్లికి వచ్చినట్టు తెలిసింది! దగ్గుబాటి ఫ్యామిలీ పక్కాగా కొవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ ఈ పెళ్లి నిర్వహించింది.
పెళ్లికి రాని వారి కోసం వీఆర్ టెక్నాలజీ ద్వారా పెళ్లిని లైవ్ లో చూసిన అనుభూతి కల్పించారు.
తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/