సూప‌ర్‌స్టార్ బ‌ర్త్ డే కానుక‌గా

`స‌ర్కారు వారి పాట` మోషన్ పోస్టర్

YouTube video
Sarkaru Vaari Paata Motion Poster

సూపర్ స్టార్ కృష్ణ‌ పుట్టినరోజు సందర్భంగా మ‌హేశ్‌బాబు 27వ సినిమా  ‘సర్కారు వారి పాట` టైటిల్  ప్ర‌క‌టిస్తూ ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అభిమానుల‌ను మెస్మరైజ్ చేసిన విష‌యం తెలిసిందే..

ఆగ‌స్ట్ 9 సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు పుట్టిన‌రోజు సందర్భంగా మహేష్ అభిమానులను హుషారెత్తించే `సర్కారు వారి పాట’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుకి బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు నిర్మాత‌లు. 

స్టైలిష్‌గా మెడ మీద వన్ రూపీ కాయిన్ టాటూతో ఇయర్ రింగ్ పెట్టుకుని ప్రీ లుక్‌లో కనిపించిన మహేశ్‌.. ఇప్పుడు మోషన్ పోస్టర్‌లో ఆ కాయిన్ టాస్ చేస్తూ క‌నిపించారు. సర్కారు వారి పాట అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో థమన్ మ్యూజిక్ సూపర్ స్టార్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో ఈ ప్రెస్టీజియస్ మూవీను నిర్మిస్తున్నాయి. 

ఈ సంద‌ర్భంగా సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు మాట్లాడుతూ  – “ నా  బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విషెస్ తెలుపుతున్న‌ ప్ర‌తి ఒక్క‌రికీ నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు.

అభిమానులు ఆశిస్తున్న అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. `సర్కారు వారి పాట’ స్ట్రాంగ్ మెసేజ్‌తో  కూడిన ఒక  కంప్లీట్ ఎంటర్‌టైనర్“ అన్నారు. 

దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ  – ” సూపర్ స్టార్ మహేశ్‌ గారిని డైరెక్ట్ చేయాలనే నా కల `స‌ర్కారు వారి పాట`  నెరవేరింది.

ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మోష‌న్ పోస్ట‌ర్‌ని విడుద‌ల‌చేయ‌డం ఆనందంగా ఉంది.” అన్నారు

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాట్లాడుతూ – ” సూపర్ స్టార్ మహేశ్‌ గారితో మ‌ళ్ళీ కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.” అన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/