మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్న టిడిపి

‘ఇదేం కర్మ’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న చంద్రబాబు

chandrababu

అమరావతిః టిడిపి వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘బాదుడే బాదుడు’ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. తాజాగా మరో కార్యక్రమానికి టిడిపి శ్రీకారం చుట్టబోతోంది. ‘ఇదేం కర్మ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఈరోజు జరగనున్న పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వైఎస్‌ఆర్‌సిపసి ప్రభుత్వం చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి పోటీగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో టిడిపి నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను, కష్టాలను తెలుసుకుంటారు. 45 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/