ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని ఫ్లాట్ గా ముగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 23 పాయింట్ల లాభంతో 59,655కి చేరుకుంది. నిఫ్టీ 0.40 పాయింట్ల స్వల్ప నష్టంతో 17,624 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.22 వద్ద కొనసాగుతుంది.