రిపబ్లిక్‌ డే రోజు ఆమెజాన్‌, ఫ్లిప్‌ కార్ట్‌ బంపర్‌ ఆఫర్లు

రెండు రోజులు మాత్రమే కొనసాగుతున్న ఈ సేల్‌లో ఆకర్షణీయమైన ఆఫర్స్‌

Amazon Great Indian Sale and Flipkart Republic Day Sale
Amazon Great Indian Sale and Flipkart Republic Day Sale

హైదరాబాద్‌: రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు స్పెషల్ సేల్ నిర్వహిస్తున్నాయి. కేవలం రెండు రోజులు మాత్రమే కొనసాగనున్న ఈ సేల్‌లో ఆకర్షణీయమైన డీల్స్ ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు ఇస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో ఐ ఫోన్ ఎక్స్ఎస్ 64 జీబీ వేరియంట్‌పై ఏకంగా రూ.39,901 వేలు డిస్కౌంట్ ఇచ్చారు. అసలు ధర రూ.89,900 కాగా, ఇప్పుడు దీనిని 49,999కే విక్రయిస్తోంది. పాత ఫోన్‌ను ఎక్స్ చేంజ్ చేస్తే ఇంకో రూ.14,050 లభిస్తుంది. యాపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్ 64జీబీ ధరను అమెజాన్ రూ.49,900 నుంచి రూ.42,900కి తగ్గించింది. పాత స్మార్ట్‌ఫోన్‌ మార్పిడిపై రూ.7,050 తక్షణ రాయితీ పొందొచ్చు. ఎస్‌బీఐ కార్డు యూజర్లకు 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. రెడ్‌మీ కె20 స్మార్ట్‌ఫోన్ ధరను ఫ్లిప్‌కార్ట్ రూ.22,999 నుంచి రూ.19,999కి తగ్గించింది. ఇక శాంసంగ్ గెలాక్సీ ఎస్9 (4జీబీ, 64జీబీ) స్మార్ట్‌ఫోన్ ధరను రూ.62,500 నుంచి రూ.22,999కి తగ్గించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/