బ్రిట‌న్ డిప్యూటీ ప్ర‌ధాని డొమినిక్ రాబ్ రాజీనామా

బెదిరింపుల ఆరోపణల నేపథ్యంలో రాబ్ రాజీనామా

UK Deputy Prime Minister Dominic Raab resigns

లండన్‌ః బ్రిటన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, న్యాయ శాఖ మంత్రి డొమినిక్ రాబ్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. వేధింపులతో కూడిన ఆయన ప్రవర్తన పైన వచ్చిన ఆరోపణలు వచ్చాయి. బెదిరింపులకు సంబంధించి అధికారిక ఫిర్యాదు పైన స్వతంత్ర దర్యాఫ్తు చేపట్టడంతో ఆయన రాజీనామా చేశారు. బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కు అందించిన లేఖలో ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

విచారణ ప్రమాదకరమైన దృష్టాంతాన్ని నెలకొల్పిందని, అయితే తాను ప్రభుత్వానికి మద్దతుగా ఉంటానని రాబ్ అందులో పేర్కొన్నారు. నేను విచారణను కోరుకున్నానని, ఏదైనా బెదిరింపులు ఉన్నట్లు తేలితే రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని నేను నా మాటను నిలబెట్టుకోవడం ముఖ్యమని విశ్వసిస్తున్నానని చెప్పాడు. కాగా, డొమినిక్ రాబ్ గత ఏడాది అక్టోబర్ నెలలో ఉపప్రధానిగా బాధ్యతలు చేట్టారు.

డామినిక్ రాబ్‌పై మొత్తంగా 8 ఫిర్యాదులు వ‌చ్చాయి. 24 మంది అధికారులు ఆ ఫిర్యాదులు అంద‌జేశారు. గ‌తంలో మంత్రిగా చేసిన‌ప్పుడు రాబ్ ప్ర‌వ‌ర్త‌న స‌రిగా లేద‌ని ఆరోప‌ణ‌లు చేశారు. బోరిస్ జాన్స‌న్ క్యాబినెట్‌లో న్యాయ‌శాఖ , విదేశాంగ‌శాఖ మంత్రి చేశారు. ఆ త‌ర్వాత థెరిసా మే క్యాబినెట్‌లో బ్రెగ్జిట్ సెక్ర‌ట‌రీగా రాబ్ చేశారు. ఆ స‌మ‌యంలో ప్ర‌భుత్వ సిబ్బందితో దురుసుగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు రాబ్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.