కరోనా కలకలం ..ఈ లక్షణాలు ఉంటె జాగ్రత్త

కరోనా మహమ్మారి మళ్లీ విజృభిస్తుంది. చాపకింద నీరులా రోజు రోజుకు తన ఉదృతిని పెంచుకుంటూ పోతుంది. ఇప్పటికే మూడు వేవ్ లతో ప్రజల ప్రాణాలు బలి తీసుకున్న ఈ మహమ్మారి..ఇప్పుడు దేశ వ్యాప్తంగా మళ్లీ వణికిస్తోంది. ఇప్పటీకే కేంద్రం కరోనా ఆంక్షలు మొదలుపెట్టడం తో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాస్క్ లు ధరించాలని హెచ్చరించాయి.

ఇక హైదరాబాద్ విషయానికి వస్తే పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న నిలోఫర్ హాస్పటల్ లో న్యూమోనియా లక్షణాలు ఉన్న ఇద్దరు చిన్నారులకు కరోనా పాజిటివ్ గా తేలింది. సాధారణంగా రెండేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు , 65 ఏళ్ల పైబడిన వారికీ న్యూమోనియా సోకుతుంది. కానీ కరోనా వల్ల కూడా న్యూమోనియా సోకుతుందని డాక్టర్స్ చెపుతున్నారు. తీవ్రమైన జ్వరం , ఆయాసం , దగ్గు , శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటె వెంటనే డాక్టర్స్ ను సంప్రదించాలని చెపుతున్నారు. ఇక గడిచిన ఇరవై నాలగు గంట‌ల్లో తెలంగాణ లో కొత్త‌గా తొమ్మిది క‌రోనా కేసులు న‌మోదైన‌ట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 27 క‌రోనా కేసులు న‌మోదు కాగా, ఒక‌రు రిక‌వ‌ర్ అయ్యారు. తాజాగా న‌మోదైన తొమ్మిది కేసుల్లో 8 మంది హైద‌రాబాద్, ఒక‌రు రంగారెడ్డి జిల్లా నుంచి ఉన్నారు. తెలంగాణ‌లో రిక‌వ‌రీ రేటు 99.51 శాతంగా ఉంది. నిలోఫ‌ర్‌లో రెండు నెల‌ల చిన్నారికి క‌రోనా నిర్ధార‌ణ కాగా, ఆ పాప‌కు వెంటిలేట‌ర్‌పై చికిత్స అందిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో పదేళ్ల లోపు చిన్నారులు… అరవై ఏళ్ల పైబడిన వారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని వైద్య అధికారులు సూచించారు.