మృతువుతో పోరాడి ఓడిన ప్రీతీ..

సీనియర్ వేదింపులు తట్టుకోలేక ఆత్మహత్య కు పాల్పడ్డ కాకతీయ మెడికల్ కాలేజీ స్టూడెంట్ ప్రీతీ..ఆదివారం రాత్రి కన్నుమూసింది. ఐదు రోజుల పాటు మృతువు తో పోరాడినప్పటికీ…మృతువు ను జయించలేక తనువు చాలించింది. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీషియా చదువుతున్న డాక్టర్ ధరావత్ ప్రీతి బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఆమెను నిమ్స్ హాస్పటల్ కు తరలించారు. అప్పటి నుండి ప్రత్యేక వైద్య బృందం ఆమెకు చికిత్స అందజేస్తూ వస్తున్నప్పటికీ , ఆమె బాడీ చికిత్స కు సహకరించలేదు. డాక్టర్స్ ఎంతో ట్రై చేసినప్పటికీ , ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆదివారం 9 గంటల 15 నిమిషాలకు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

ఇక నిమ్స్ వద్ద పెద్ద ఎత్తున ఎస్సీ, ఎస్టీ సంఘాలు చేరుకొని ఆందోళన చేపట్టాయి. విద్యార్థిని ప్రీతికి న్యాయం చేయాలంటూ వారంతా కోరుతున్నారు. ప్రీతి కుటుంబానికి రూ. 5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. పోలీసులకు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ వచ్చే వరకూ ప్రీతి మృతదేహాన్ని నిమ్స్ నుంచి కదిలించి లేదంటూ నినాదాలు చేస్తున్నారు. హెచ్ఓడీ, ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలంటున్నారు. అటు ప్రీతి మృతితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ , నిందితుడు సైఫ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.