అలీబాగ్ వద్ద తీరాన్ని తాకిన నిసర్గ తుపాను

అన్ని బీచ్ లలో సెక్షన్ 144

అలీబాగ్ వద్ద తీరాన్ని తాకిన నిసర్గ తుపాను
Cyclone Nisarga

ముంబయి: అరేబియా సముద్రంలో ఏర్పడ్డ నిసర్గ తుపాను తీవ్ర తుపానుగా మారి ఈరోజు మధ్యాహ్నం ముంబయికి సమీపంలో ఉన్న అలీబాగ్ వద్ద తీరం దాటింది. తీరం దాటుతున్న సమయంలో గాలి వేగం గంటకు 120 కిలోమీటర్ల వేగంగా ఉంది. తుపాను పూర్తిగా తీరం దాటడానికి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిసర్గ ప్రభావంతో తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. మహారాష్ట్రలోని అన్ని బీచ్ లలో సెక్షన్ 144 ప్రకటించారు. తీరం దాటిన మూడు గంటల్లోగా తుపాను ముంబయి, థానే జిల్లాలోకి ప్రవేశించనుంది. మరోవైపు ఇప్పటికే కరోనాతో అల్లకల్లోలంగా మారిన మహారాష్ట్రకు ఈ తుపాను పెను విపత్తుగా పరిణమించనుంది. ఈ నేపథ్యంలో ముంబయిలో చికిత్స పొందుతున్న రోగులను, తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 48 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.


తాజా కరోనా లాక్‌డౌన్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/corona-lock-down-updates/