బంగ్లాదేశ్ లోని ఇస్కాన్ ఆల‌యంపై ఉన్మాదుల దాడి

ఆలయ ప్రాంగణం ధ్వంసం – ముగ్గురు భక్తులకు గాయాలు

attack on the temple
The interior of the temple

Dhaka: బంగ్లాదేశ్ లోని ఇస్కాన్ ఆల‌యంపై ఉన్మాదులు విరుచుకు పడ్డారు. దాదాపు 100 నుంచి 299 మంది మందితో కూడిన మూక ఇస్కాన్ దేవాల‌యంపై దాడికి ఒడిగట్టారు. బంగ్లాదేశ్ లోని ఢాకా లాల్మోహన్ సాహా స్ట్రీట్ లో ఈ సంఘటన జరిగింది. ఈ దాడికి హాజీ షఫివుల్లా (62) నాయకత్వం వహించాడు.

ఆలయంలోని విగ్రహాన్ని అపవిత్రం చేయడం, ప్రాంగణాన్ని ధ్వంసం చేశారు. నగదు, కొన్ని విలువైన వస్తువులను అపహరించారు. ఉన్మాదుల దాడిలో ముగ్గురు భక్తులు సుమంత్ర చంద్ర శ్రవణ్, నిహార్ హల్దార్ , రాజీవ్ భద్ర గాయపడ్డారు. కాగా, దీనికి సంబంధించి వీడియోలు , ఫోటోలను ‘వాయిస్ ఆఫ్ బంగ్లాదేశీ హిందూ ‘ తన ట్విట్టర్ లో షేర్ చేసింది.

తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/