ఇందిరాపార్క్ లో ఘనంగా హోలీ వేడుకలు

పాల్గొన్న మంత్రి ‘తలసాని ‘

Minister Talasani Srinivasa Yadav participating in the Holi celebrations
Minister Talasani Srinivasa Yadav participating in the Holi celebrations

Hyderabad: మన పండుగలు మన సంస్కతి, సాంప్రదాయాలను తెలియ జేస్తాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం హోలీ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలోఇందిరా పార్కులో ఏర్పాటు చేసిన వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేడుకలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ డ్యాన్స్ చేసి పాల్గొన్నవారిలో జోష్ నింపారు. చిన్న, పెద్దా అందరూ దేశం మొత్తం ఎంతో సంతోషంగా హోలీ జరుపుకోవడం జరుగుతోందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వం రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలను పెంపొందించేల అన్ని పండుగలను ఎంతో ఘనంగా నినిర్వహిస్తోందని తెలిపారు. అంతేకాకుండా ఇందిరా పార్క్ అభివృద్దికి అనేక చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. వాకర్స్ సమస్యలను పరిష్కరించిందని, ఇక్కడ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
ఇదిలావుండగా, ఇక్కడ శాశ్వత స్విమ్మింగ్ పూల్ నిర్మించాలని వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి మాట్లాడుతూ , ఇందిరా పార్కులో స్విమ్మింగ్ పూల్ నిర్మిస్తామని అన్నారు. అంతేకాకుండా , ట్యాంక్ బండ్ నుండి ఇందిరా పార్క్ వరకు రోప్ వే ను నిర్మించాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళినట్లు మంత్రి తెలిపారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించే విధంగా ఫ్లై ఓవర్ నిర్మాణం చేపడతామని మంత్రి తలసాని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/