మంచు మనోజ్ రెండో పెళ్లి తేదీ ఫిక్స్ అయ్యిందా..?

మంచు మనోజ్ రెండో పెళ్లి గురించి గత కొద్దీ రోజులుగా చర్చ నడుస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. భూమా మౌనిక రెడ్డి ని మనోజ్ వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కాగా ఇక ఇప్పుడు వీరి వివాహ తేదీ కూడా ఫిక్స్ అయినట్లు ఫిలిం సర్కిల్లో అంత మాట్లాడుకుంటున్నారు. మార్చి 03 న భూమా మౌనిక రెడ్డి మెడలో మనోజ్ తాళి కట్టబోతున్నారని , ఇప్పటికే పెళ్లి పనులు పూర్తి అయ్యాయని అంటున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన ఓ ఫంక్షన్ మనోజ్ సోదరి లక్ష్మీ ప్రసన్న ఇంట్లో జరిగినట్లు తెలుస్తోంది.

ప్రముఖ రాజకీయ కుటుంబం భూమా నాగిరెడ్డి కుమార్తె అయిన మౌనిక రెడ్డికి గతంలో పెళ్లి జరిగి విఫలమైంది. మనోజ్ కు కూడా పెళ్లి జరిగి విడాకులకు దారి తీసింది. ఇక ఇప్పుడు వీరిద్దరూ కూడా రెండో వివాహ బంధం తో ఒకటి కాబోతున్నట్లు సమాచారం. పెళ్లి తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక మనోజ్ సినిమాల విషయానికి వస్తే..కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడి గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన మంచు మనోజ్..తనదైన యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ వచ్చాడు. 2004లో దొంగ దొంగది సినిమాతో హీరోగా పరిచయమైన మనోజ్.. ఆ తర్వాత బిందాస్ చిత్రంతో నంది అవార్డ్ అందుకున్నారు. తర్వాత వేదం, ఝుమ్మంది నాదం, కరెంట్ తీగ, రాజు భాయ్ వంటి చిత్రాలతో మెప్పించారు. ఆ తర్వాత పలు ప్లాప్స్ పడేసరికి సినిమాలకు దూరమయ్యాడు.

ఆరేళ్ల బ్రేక్ తర్వాత మనోజ్ తన కొత్త సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు ‘వాట్ ది ఫిష్’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి వరుణ్ కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్.. సినిమా గురించిన కీలక అంశాలను వెల్లడించారు మనోజ్. మరి ఈ సినిమాను ఎప్పుడు మొదలుపెడతారో..ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారో చూడాలి.