కాంగ్రెస్ నేతలను పరామర్శించేందుకు చంచల్ గూడ జైలు కు రాహుల్

ఈ నెల 07 న రాహుల్ గాంధీ చంచల్ గూడ జైలు లో ఉన్న కాంగ్రెస్ నేతలను పరామర్శిస్తారని టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలు బలమూరి వెంకట్ తో పాలు 18 మంది నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే ఈ నెల 7న వీరిని పరామర్శించేందుకు రాహుల్ గాంధీ చంచల్ గూడ జైలుకు వస్తారని రేవంత్ రెడ్డి అన్నారు.

ఇందుకోసం చంచల్ గూడ సూపరింటెండెంట్ ని కలిసి వినతిపత్రం ఇచ్చామని వెల్లడించారు. అందుకు తగినట్లు ఏర్పాట్లు చేయాలని జైలు సూపరింటెండెంట్ ని కోరామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులను కలిసేందుకు ఏ ఐ సిసి నేత రాహుల్ గాంధీ వస్తున్నారని విజ్ఞప్తి చేస్తే అనుమతి ఇవ్వకపోగా విద్యార్థి నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేసి జైలులో వేయటం అమానుషమని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. NSUI విద్యార్థులు రాజకీయాలకు అతీతంగా ఈ పర్యటన ఉంటుందని విసి ని విజ్ఞప్తి చేశారని, అక్కడికి వెళ్లిన విద్యార్థి నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో బంధించారని మండిపడ్డారు. ఓయూలో విద్యార్థి నాయకులను కలవాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారని, కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్, కేటీఆర్, కవిత ఈరోజు ఎక్కడ ఉండేవారో గుర్తు చేసుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు.