తెలంగాణ లో మరో మెడికల్ విద్యార్థి ఆత్మహత్య

కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీషియా చదువుతున్న డాక్టర్ ధరావత్ ప్రీతి బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెలిసిందే. సీనియర్ వేదింపులు భరించలేక ఈమె ఆత్మహత్య చేకోవాలని అనుకుంది. ప్రస్తుతం నిమ్స్ హాస్పటల్ లో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అవ్వగా..ప్రభుత్వం సైతం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. ప్రస్తుతం నింతుడ్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది.
ఈ ఘటన గురించి ఇంకా మాట్లాడుకుంటుండగానే మరో మెడికల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మెడికో, ఫైనలియర్ విద్యార్ధి దాసరి హర్ష ఆత్మహత్య చేసుకున్నాడు. ఏ కారణంగా విద్యార్థి మృతి చెందాడో తెలియరాలేదు. కానీ మెడికల్ విద్యార్ధి దాసరి హర్ష ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు బంధువులు. దాసరి హర్ష స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామంగా పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.