పెళ్లి కొడుకు గెటప్ లో మంచు మనోజ్..లక్ష్మి ట్వీట్ వైరల్

మంచు మనోజ్ రెండో పెళ్లి గురించి గత కొద్దీ రోజులుగా చర్చ నడుస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. భూమా మౌనిక రెడ్డి ని మనోజ్ వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కాగా ఇప్పటివరకు పెళ్లి గురించి మంచు ఫ్యామిలీలో ఎవ్వరు అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా మంచు లక్ష్మి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. మార్చి 03 న భూమా మౌనిక రెడ్డి మెడలో మనోజ్ తాళి కట్టబోతున్నాడు. ఈ క్రమంలో మంచు లక్ష్మి ట్విట్టర్ లో..దిష్టిపెట్టే ప్రతి కన్ను గుడ్డిదైపో గాక అన్నట్లు అర్థం వచ్చేలా ఇంగ్లీషులో ఒక సామెతను కొటేషన్ గా పెట్టుకున్న షర్టును ధరించాడు. మనసు మనోజ్ అదే ఫోటో షేర్ చేసిన మంచు లక్ష్మి కూడా అదే క్యాప్షన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది. ఈరోజు మంచు మనోజ్ మెహందీ ఫంక్షన్ జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రముఖ రాజకీయ కుటుంబం భూమా నాగిరెడ్డి కుమార్తె అయిన మౌనిక రెడ్డికి గతంలో పెళ్లి జరిగి విఫలమైంది. మనోజ్ కు కూడా పెళ్లి జరిగి విడాకులకు దారి తీసింది. ఇక ఇప్పుడు వీరిద్దరూ కూడా రెండో వివాహ బంధం తో ఒకటి కాబోతున్నట్లు సమాచారం.

ఇక మనోజ్ సినిమాల విషయానికి వస్తే..కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడి గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన మంచు మనోజ్..తనదైన యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ వచ్చాడు. 2004లో దొంగ దొంగది సినిమాతో హీరోగా పరిచయమైన మనోజ్.. ఆ తర్వాత బిందాస్ చిత్రంతో నంది అవార్డ్ అందుకున్నారు. తర్వాత వేదం, ఝుమ్మంది నాదం, కరెంట్ తీగ, రాజు భాయ్ వంటి చిత్రాలతో మెప్పించారు. ఆ తర్వాత పలు ప్లాప్స్ పడేసరికి సినిమాలకు దూరమయ్యాడు.

ఆరేళ్ల బ్రేక్ తర్వాత మనోజ్ తన కొత్త సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు ‘వాట్ ది ఫిష్’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి వరుణ్ కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్.. సినిమా గురించిన కీలక అంశాలను వెల్లడించారు మనోజ్. మరి ఈ సినిమాను ఎప్పుడు మొదలుపెడతారో..ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారో చూడాలి.