ఏపీలో గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం ఫై ఎంపీ విజయసాయి ట్వీట్

vijayasai reddy tweet to godfather prerelease

ఈ నెల 28 న అనంతపురంలో గాడ్ ఫాదర్ మూవీ కి సంబంధించి మెగా ఈవెంట్ ను జరపబోతున్నారు. ఈ క్రమంలో ఈ ఈవెంట్ ఫై వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేసారు. మెగాస్టార్ చిరంజీవి – మోహన్ రాజా కలయికలో గాడ్ ఫాదర్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసిఫర్’ రీమెక్ ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా అక్టోబర్ 05 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా, థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్ కార్య క్రమాల్లో భాగంగా ఈ బుధవారం అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది అని చిత్ర బృందం తెలిపింది. అయితే.. ఈ ఈవెంట్‌ ను ఏపీలో నిర్వహించడంపై విజయసాయిరెడ్డి స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి గారి సందేశాత్మక చిత్రం ‘గాడ్ ఫాదర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రాలో చేస్తుండటం సంతోషకరమన్నారు. ఆయనకు నా శుభాకాంక్షలు. నాలుగున్నర దశాబ్దాలుగా చిత్రసీమను రంజిపజేస్తున్న మెగా స్టార్ లో అదే ఉత్సాహం…అయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని చిరుపై ప్రశంసలు కురిపంచారు. ఇక ఈ మెగా ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవితో పాటు గాడ్ ఫాదర్ యూనిట్ సభ్యులంతా హాజరుకానున్నారు. ఈ సినిమాలో చిరంజీవి తొలిసారి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించనున్నారు. సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని వంటి స్టార్ నటి నటులు నటిస్తున్నారు.