400 కిలోమీటర్లను పూర్తి చేసిన నారా లోకేష్

యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టిన నారా లోకేష్..బుధువారం 31 వ రోజు పూర్తి చేసాడు. ఈరోజు తో 400 కిలోమీటర్లను పూర్తి చేసినట్లు అయ్యింది. ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగుతుంది. లోకేష్ యాత్ర కు టీడీపీ శ్రేణులు , ప్రజలు బ్రహ్మ రథంపడుతున్నారు.

ఈరోజు పాదయాత్ర హైలైట్స్ చూస్తే.. ప్రజల ఆశీస్సులతో 400 కి.మీ దూరాన్ని పూర్తి చేశానని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. 4 వేల కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యేంత వరకు తాను విశ్రమించబోనని అన్నారు. ఇప్పటి వరకు పాదయాత్రపై పోలీసులు 12 కేసులు నమోదు చేశారు. అంటే సగటున ప్రతి 33 కిలోమీటర్లకు ఒక కేసు నమోదయింది. పాకాల హైస్కూలు గ్రౌండ్ లో విద్యార్థులతో కాసేపు లోకేష్ వాలీబాల్ ఆడారు. ఈ సందర్భంగా తమకు డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని లోకేశ్ కు విద్యార్థులు వినతి పత్రం అందించారు. పాకాల మార్కెట్ వద్ద స్టూలుపై నిలబడి చిరువ్యాపారులతో మాట్లాడారు.

యువతలో నైపుణ్యాన్ని పెంచే విధంగా సిలబస్ లో మార్పులు తెస్తామని లోకేశ్ తెలిపారు. 2025 జనవరిలో పూర్తిస్థాయి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసి ఛార్జీలు, పెట్రోలు, డీజిల్, నిత్యవర వస్తువుల ధరలన్నీ తగ్గిస్తామని హామీ ఇచ్చారు.

జగన్ రెడ్డికి పబ్జీ ఆడుకోవడం తప్ప…వేరే ఆటలపై అవగాహనే లేదు. చంద్రబాబు పాలనలో గోపీచంద్, పీవీ సింధును ప్రోత్సహించారు. ప్రపంచవ్యాప్తంగా వాళ్లు చరిత్ర సృష్టించారు. చిత్తూరును స్పోర్ట్స్ హబ్ గా చేయాలని చంద్రబాబు సంకల్పించారు. మనం అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే తిరుపతికి స్పోర్ట్స్ యూనివర్శిటీని తీసుకొస్తాం అన్నారు.