అవగాహనతోనే నిర్ణయాలు

‘మనస్విని’ వ్యక్తిగత సమస్యల పరిష్కారవేదిక

solution to problems
solution to problems

మేడమ్‌! నా వయసు 45 సంవత్సరాలు. మా అమ్మాయి పెళ్లి మధ్యనే చేసాము. చాలా ఖర్చులు అయ్యాయి. నేను రెండవ భార్యను.

నా భర్త మొదటి భార్య కూడా మా ఊళ్లోనే ఉంటుంది. నా భర్త ఇద్దరినీ బాగానే చూచుకుంటాడు. కానీ తన మొదటి భార్య కుటుంబంతోనే ఎక్కువ ఉంటాడు.

దీని వల్ల మా ఇద్దరి మద్య అప్పుడప్పుడూ గొడవలు అవ్ఞతాయి. మేము సామరస్యంగా ఉండాలంటే ఏం చేయాలి. ఈ బాధల నుండి ఎలా బయటపడాలి? – శ్రీలక్ష్మి

ముందుగా మీ వివాహం యొక్క చట్టబద్ధతను చూడండి. ఏది ఏమైనా చట్టాన్ని మనం అనుసరించాలి. లేని యెడల చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.

జీవితంలో మన సమస్యలని మనం మాత్రమే సృష్టించుకొంటాము. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి నిర్ణయం వెనుక మంచి స్పష్టమైన అవగాహన స్పష్టత ఉండాలి.

మనం ఏ విత్తనం వేస్తే అదే మొలుస్తుంది. అందువల్ల మంచి విత్తనాలు వెయ్యాలి. అంటే మంచి అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటే, వాటి పరిణామాలు బాగుంటాయి.

ఇప్పుడైనా సరే, భార్యాభర్తల సంబంధాలు చక్కగా జాగ్రత్తగా చూచుకోవాలి. అపార్థాలు, అపనమ్మకాలు చాలా సమస్యలు తెచ్చిపెడతాయి.

అందువల్ల వివేకంతో జీవితం గడపాలి. వివేకం అమూల్యమైనది. వివేకంతో మంచి ఆనందమైన జీవితం మీ సొంతం అవుతుంది.

కుటుంబ వాతావరణం ఆనందంగా అనుబంధాలతో నిండి ఉండాలి. ఒకరికొకరు అర్ధం చేసుకోవాలి. ప్రేమానుబంధాలు పంచుకోవాలి.

దయ, ఆర్ధ్రతలతో కూడిన జీవితం ఎంతో సత్ఫలితాలను అందిస్తుంది. సృష్టికి మూలం ఆనందం, ప్రేమ. ఇవి రెండూ రెండు కళ్ల లాంటివి. అందువల్ల కుటుంబంలో బంధాలకు ఇవి రెండూ ఉండాలి.

ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. బాధ్యతతో కూడిన బంధాలు సఫలీకృతం కావాలంటే కావల్సింది అవగామన, స్పష్టత, ప్రేమ, బాధ్యత, ఆనందం, పరస్పర గౌరవం. ఇవన్నీ తప్పనిసరిగా ఉండాలి.

ఆలోచనారీతిలోనే సమస్య

మేడమ్‌! నా వయసు 28 సంవత్సరాలు. మేమిద్దరం చిన్న ఉద్యోగాలు చేస్తూ బ్రతుకుతున్నాము. నేను, నా భర్త ఎల్లప్పుడూ ఖర్చుల విషయమై గొడవలు పడుతుంటాము.

మాకు ఇద్దరు చిన్న పిల్లలు. ఆర్థికంగా చాలా బాధలు పడుతున్నాము. అందులో ఇప్పుడు ‘లాక్‌డౌన్‌ వల్ల తం కూడా సరిగా రావటం లేదు.

ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడటం ఎలా? కొంచెం వివరంగా చెప్పండి ప్లీజ్‌… ఓ సోదరి, హైదరాబాద్

మీరు తప్పక ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడగలరు. ముందుగా మీరు మీ ఆలోచనారీతిని సానుకూలంగా మార్చుకోవాలి. ప్రతి సమస్య మన ఆలోచనారీతిలోనే ఉంటుంది.

అందువల్ల మీరు, మీకు సమృద్ధిగా వనరులున్నాయని గుర్తిచండి.

మానవజన్మ ఎంతో ఉన్నతమైనది. చిన్నచిన్న జీవాలు కూడా ఈ ప్రకృతిలో జీవిస్తున్నాయి ఆనందంగా. జీవితం సరళమైంది.

తిండికి, నీడకు చాలా తక్కువ ఖర్చులు అవ్ఞతాయి. తక్కువ ఖర్చుతో కూడా మంచి ఆహారం తీసుకోవచ్చు. తక్కువ అద్దెతో కూడా ఇళ్లు దొరుకుతాయి.

పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించవచ్చు.

ప్రభుత్వ పథకాల ద్వారా ఎన్నో సౌకర్యాలు అంది పుచ్చుకోవచ్చు. మంచిగా ఉన్నప్పుే డబ్బుని ఆదా చేసుకోవాలి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి.

ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లల్ని పోషించడం చాలా సులభం. ఎన్నో పరిశోధనల ద్వారా ఇదే తేలింది.

చాలా చిన్న ఆదాయంలో కూడా మంచిగా బ్రతకవచ్చు అని. కానీ మంచి అలవాట్లు ఉండాలి. డబ్బుని దుర్వినియోగం చేయకూడదు.

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. జీవితంలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి. జీవితాన్ని ఆనందంగా తీర్చిదిద్దుకోవాలని కోరిక, ఆకాంక్షలు ఉండాలి.

అప్పుడు చక్కగా జీవించగలరు. ఇందులో అనుమానం లేదు.

  • డాక్టర్‌ ఎం. శారద, సైకాలజీ ప్రొఫెసర్‌

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/