రాగుల్లో విశేష ఔషధ గుణాలు

ఆహారం- ఆరోగ్యం

Oats
Oats

ఒకప్పుడు ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో రాగులు మన ఆహారంలో భాగం. ఆ తర్వాత కొన్ని రోజులు మరుగున పడిపోయాయి. అయితే కొంతమంది ఆరోగ్య నిపుణుల సూచనలతో మళ్లీ చాలా మంది చూపు వీటి వైపు మళ్లింది.

వీటి వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. రాగుల్లో ఉన్న పోషకాలు మెండు, తక్కువ ధరలో, అందరికీ సులభంగా లభించే ఈ రాగులతో ఎన్నో అద్భుత గుణాలు దాగి ఉన్నాయి.

వరిలో ఉన్నత ప్రొటీన్‌ రాగుల్లో కూడా ఉంటుంది.

అయితే ఈ ప్రొటీన్‌ మిగతా ఆహారపదార్థాల్లో అంతగా లభించదు. ఇది శారీరక ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉన్నన్ని పోషకాలు మిగిలిన ఏ ధాన్యాలలోను లేవు.

కాబట్టి రోజువారి ఆహారంలో దీన్ని భాగం చేసుకుంటే పోషకాహార లేమి అంటూ ఉండదు. శాకాహారులు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ధాన్యమిది.

రాగులు మొదట ఆఫ్రికాలో పండించేవారు. భారతదేశంలో నాలుగు వేల యేళ్ల ముందు వీటిని సాగు చెయ్యడం మొదలుపెట్టారు.

సింధు నాగరికత సమయంలోనే ప్రజల ఆహారంలో ఇవి భాగమమైనాయి. రాగుల్లో మినరల్స్‌ ఎక్కువ. కాల్షియం శాతం కూడా ఎక్కువే. ఇందులో ఫాస్పరస్‌, పొటాషియం, ఐరన్‌ కూడా ఎక్కువగానే ఉంటాయి.

కాల్షియం సప్లిమెంట్స్‌ తీసుకునే బదులు రాగులు తినడం మంచిది. హీమోగ్లోబిన్‌ లెవెల్స్‌ తక్కువగా ఉన్నవారు ఆస్టియోపొరాసిస్‌ వచ్చే అవకాశం ఉన్నవారు రాగుల్ని తప్పని సరిగా తీసుకోవాలి.

వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బల ంగా మారుతాయి. అందుకే వయసు పెరిగినవారు చిన్న పిల్లలు వీటిని రెగ్యులర్‌గా తీసుకోవాలి.

రాగులపై పొరలో మిగిలిన ధాన్యాల కంటే ఎక్కువ పాలిఫినాల్స్‌ ఉంటాయి. రాగులు బ్లడ్‌ గ్లూకోజ్‌ లెవెల్స్‌ తగ్గించడమే కాక హైపోగ్లెసీమిక్‌ స్ట్రెస్‌ని తగ్గిస్తాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో గాయం తొందరగా తగ్గడానికి కూడా ఇవి సహకరిస్తాయి.కాబట్టి వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది.

యాంటీ బాక్టీరియల్‌ గుణాలు రాగుల్లో పుష్కలంగా ఉంటాయి.

కాబట్టి, ఫుడ్‌ పాయిజనింగ్‌ కీ, టైఫాయిడ్‌ లాంటి జ్వరాలకీ, సెల్యులైటిస్‌ లాంటి స్కిన్‌ ఇన్‌ఫెక్షన్స్‌ ఉన్నప్పుడు వీటిని జావలా చేసుకుని తాగడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.

రాగులు ట్రైగ్లిసరైడ్స్‌ ఏర్పడకుండా చేసి గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. హార్ట్‌ ఎటాక్స్‌గానీ, స్ట్రోక్స్‌ గానీ రాకుండా చేస్తాయి.

ఎలాంటి వారికైనా రాగులు అద్భుతంగా పనిచేస్తాయి. రాగి మాల్ట్‌, రాగి లడ్డూ, రాగి హల్వా, రాగి పకోడా, రాగి బిస్కెట్లూ, రాగి దోసె, రాగి సంకటి లాంటివి హాయిగా తినవచ్చు. రాగుల్లో యాంటీ – ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి.

ఈ యాంటీ – ఆక్సి డెంట్స్‌ సెల్‌ డామేజ్‌ జరగకుండా చేసి కాన్సర్‌ లాంటి వ్యాధులు రాకుండా చేస్తాయి.

ఇందులో ఉండే ఫినాలిక ఆసిడ్స్‌ ఫ్లేవనాయిడ్స్‌, టానిన్స్‌ వలన యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉంటాయి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/