శంషాబాద్ లో దారుణం : ప్రియురాలిని హత్య చేసి..మ్యాన్ హోల్ లో పూడ్చి పెట్టిన పూజారి

శంషాబాద్ లో దారుణం జరిగింది. అప్సరా అనే అమ్మాయిని దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని సరూర్ నగర్ వద్దకు తీసుకొని మురికి కాలువలో పడేసి మట్టితో పూడ్చిపెట్టాడు పూజారి సాయి. ఆ తర్వాత ఆప్సరా మిస్సింగ్ అయిందంటూ ఎయిర్ పోర్ట్ పోలీస్‌ స్టేషన్ లో పిర్యాదు చేసాడు. పిర్యాదు తో రంగంలోకి దిగిన పోలీసులు అసలు నిజాన్ని బయటపెట్టారు.

వివరాల్లోకి వెళ్తే..

సరూర్‌నగర్‌కు చెందిన పూజారి వెంకట సాయికృష్ణ(36).. అదే ప్రాంతంలో ఉంటున్న అప్సర (30) అనే యువతితో వివాహేతర సంబంధం కూడా పెట్టుకున్నాడు. అయితే సాయికృష్ణకు అప్పటికే వివాహమై ఇద్దరూ పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని సదరు యువతి ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఆమెను అడ్డుతప్పించుకోవాలని సాయికృష్ణ ప్లాన్‌ చేసుకున్నాడు.

ఈ నెల 3న అప్సరను సరూర్‌నగర్‌ నుంచి కారులో ఎక్కించుకుని శంషాబాద్‌కు తీసుకొచ్చాడు. నార్కుడ వద్దకు వచ్చిన తర్వాత అప్సరకు ట్యాబ్లెట్‌ ఇచ్చి మత్తులోకి దించాడు. ఆ తర్వాత ఆమె తలపై బండరాయితో కొట్టి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని కవర్‌లో పెట్టి సరూర్‌ నగర్‌ తీసుకొచ్చాడు. అక్కడే ఒక మ్యాన్‌హోల్‌లో పడేశాడు. దాన్ని కాంక్రీట్‌తో పూడ్చేశాడు. ఆ తర్వాత ఏ తెలియనట్లుగా ఈ నెల 5న శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్‌ కేసు పెట్టాడు. అప్సర స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్తానని చెప్పడంతో ఆమెను శంషాబాద్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద డ్రాప్‌ చేశానని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సాయికృష్ణపై అనుమానం వచ్చి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.