108 థియేటర్స్ లలో ‘భగవంత్ కేసరి’ టీజర్

నందమూరి బాలకృష్ణ – కాజల్ జంటగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘భగవంత్ కేసరి’ మూవీ టీజర్ రేపు 108 థియేటర్స్ లలో ప్రదర్శన కాబోతుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసారు. ఉదయం 10:19 AM గంటలకు ఈ సినిమా టీజర్‌ ను రిలీజ్ చేయబోతుంది. గత కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్న ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్‌నే ఖరారు చేస్తూ రెండు రోజుల క్రితం పోస్టర్ వదిలారు.

‘ఐ డోంట్ కేర్’ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో బాలకృష్ణ పోషించిన పాత్ర పేరే సినిమా టైటిల్‌గా పెట్టడం జరిగింది. ఈ మూవీ లో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. షైన్‌ స్ర్కీన్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా కానుగా ఈ చిత్రం విడుదల కానుంది.