కరీంనగర్ రైతు బజార్లో వ్యక్తి మృతి
కరోనా భయంతో సాయం చేయని స్థానికులు

కరీంనగర్: రాష్ట్రంలో కరోనా భయం సాటి మనిషికి కూడా సాయం చేయలేని స్థితికి తీసుకువచ్చింది.. కరీంనగర్ లోని కశ్మీర్‌గడ్డ రైతుబజార్ లో ఈ రోజు కూరగాయల కోసం వచ్చిన ఒక వ్యక్తి గుండెపోటు రావడంతో అక్కడిక్కక్కడె చనిపోయాడు. అయితే ఆ మృతదేహం వద్దకు రావడానికి స్థానికులు భయపడుతున్నారు. గతంలో ఇండోనేషియా నుండి వచ్చిన వారు కరీంనగర్ లోనే ఉండడం, వారికి కరోనా పాజిటివ్ రావడంతో ప్రజలలో భయం పెరిగింది. చివరకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మృతుడి కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/