ఢిల్లీ జామియా వర్శిటీలో కాల్పులు

Jamia students

Firing

న్యూఢిల్లీ: ఢిల్లీ జామియా ఇస్లామియా యూనివర్శిటీలో ఈరోజు కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ అగంతకుడు కాల్పులు జరిపాడు. ఆజాదీ కావాలా అంటూ రివాల్వర్‌తో బెదిరిస్తూ కాల్పులు జరిపాడు. సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అకస్మాత్తుగా విద్యార్థుల చేస్తున్న ర్యాలీని వ్యతిరేకిస్తూ కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు అతడ్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కాల్పుల్లో ఓ విద్యార్థి గాయాలపాలైనట్లు సమాచారం. అయితే విద్యార్థులు మాత్రం పోలీసులే కాల్పులకు దిగారంటూ ఆరోపిస్తున్నారు. సీఏఏ, ఎన్ఆర్సీకు వ్యతిరేకంగా జామియా కోఆర్డినేషన్ కమిటీ (జేసీసీ) ర్యాలీ నిర్వహించింది. జామియా నగర్ నుంచి రాజ్ ఘాట్ వరకు ఈ కార్యక్రమం కొనసాగింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/