బాబు మోహన్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నాడా..?

బాబు మోహన్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నాడా..? ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తుంది. 1999లో మెదక్ జిల్లా ఆందోల్ నియోజక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున శాసన సభ్యులుగా ఎన్నికై సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేశాడు. 2004, 2014 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజ నర్సింహ చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం పొందడు. 2019 లో బీజేపీ లో చేరి ఆందోల్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే గా పోటి చేసి ఓడిపోయాడు. ప్రస్తుతం బిజెపి పార్టీ లో ఉన్నప్పటికీ ఆయన కు సరైన గౌరవం దక్కడం లేదని ఫీల్ అవుతున్నారు.

అంతే కాకుండా తన నియోజకవర్గంలో కూడా మరో నేతకు బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు రావడంతో బాబు మోహన్ ఇక బిజెపి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరాలని అనుకుంటున్నారట. దీనికి సంబంధించి త్వరలోనే ఆయన ప్రకటన కూడా చేయవచ్చని తెలుస్తోంది. బాబు మోహన్ తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి తో సన్నిహితంగా మెలిగారు. రీసెంట్ గా రేవంత్ తో బాబు మోహన్ మాట్లాడాడినట్లు చెపుతున్నారు. రేవంత్ సైతం ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ ని అధికారం లోకి తీసుకరావాలని గట్టిగానే ట్రై చేస్తున్నాడు. సీనియర్ నేతలను కలుపుకుంటూ..ఇతర పార్టీ ల నేతలకు గాలం వేస్తూ వస్తున్నాడు. మరి బాబు మోహన్ కాంగ్రెస్ కండువా ఎప్పుడు కప్పుకునేది ఎప్పుడు చెపుతారో చూడాలి.