మహిళా ఫుటుబాలర్‌ బాలాదేవికి అపూర్వ ఘనత

Ngangom Bala Devi
Ngangom Bala Devi

బెంగళూరు: భారత మహిళా ఫుట్‌బాల్‌ కెప్టెన్, ఫార్వర్డ్ బాలాదేవీ అరుదైన ఘనత సంపాదించారు. విఖ్యాత స్కాట్లాండ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ రేంజర్స్‌ ఎఫ్‌సీకి ప్రాతినిధ్యం వహించే గొప్ప అవకాశాన్ని బాలాదేవీ దక్కించుకున్నారు. దీంతో విదేశీ క్లబ్ కాంట్రాక్టు సాధించిన భారత తొలి మహిళా సాకర్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించారు. బాలాదేవి తమ జట్టుతో 18 నెలలు పనిచేయనుందని రేంజర్స్ క్లబ్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. గత నవంబర్ నెలలో జరిగిన సెలెకషన్ ట్రైల్స్ లో పాల్గొన్న మణిపూర్‌కు చెందిన 29 ఏళ్ల బాలాదేవి ఆటతీరుతో సంతృప్తి చెందిన రేంజర్స్ క్లబ్ 18 మాసాల కాంట్రాక్టు కుదుర్చుకొంది. దీంతో రేంజర్స్ తరఫున ఆడుతున్న మొట్టమొదటి ఆసియా అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా రికార్డుల్లోకి ఎక్కింది. 15 సంవత్సరాల వయసు నుండి సాకర్ ఆడుతూ వస్తున్న బాలాదేవి భారత సీనియర్ జట్టులో సభ్యురాలిగా ఇప్పటి వరకూ ఆడిన 58 మ్యాచ్‌లలో గోల్స్‌ను సాధించింది. ఓ విదేశీ సాకర్ క్లబ్‌కు ఎంపిక కావడంతో బాలాదేవి ఆనందం వ్యక్తం చేస్తోంది. ‘ప్రపంచంలోని అతిపెద్ద క్లబ్‌లలో ఒకటైన రేంజర్స్‌కి ప్రాతినిధ్యం వహిస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఓ భారత మహిళగా నాకు ఎంతో గర్వకారణం. భారత మహిళలు సైతం ఫుట్‌బాల్‌ క్రీడలో విదేశీక్లబ్ జట్లకు ఆడగలరని ఆశిస్తున్నా’ అని బాలాదేవి పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/