గాయపడ్డ మమతా బెనర్జీ..హాస్పటల్ లో చికిత్స

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ గాయపడ్డారు. గురువారం తన ఇంట్లో వ్యాయామం చేస్తుండగా జారిపడ్డారు. దీంతో ఆమె తల నుదుటిపై భారీ గాయమైంది. ఈ విషయాన్ని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఎక్స్‌’ట్విటర్‌’లో వెల్లడించింది. మమతా తలకు గాయమైన ఫోటోను షేర్‌ చేసింది.

ఆసుపత్రి బెడ్‌పై మమతా పడుకొని ఉండగా.. ఆమె తల నుదుటి భాగాన గాయమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. ముఖం మీదుగా మెడ వద్దకు రక్తం కారుతూ కనిపిస్తున్నారు. ‘మా చైర్‌పర్సన్ మమతా బెనర్జీ గాయపడ్డారు. దయచేసి ఆమెకోసం ప్రార్థించండి’ అంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రిలో మమతా చికిత్స తీసుకుంటున్నారు.