దేశ ప్రజలకు హిందీ దివస్ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ హిందీ దివస్ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హిందీని ఓ బలమైన భాషగా తీర్చిదిద్దడంలో వివిధ ప్రాంతాల ప్రజలు గణనీయమైన పాత్ర పోషించారని ప్రశంసించారు. సమష్టి కృషి వల్ల హిందీ భాష ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు కొనసాగిస్తోందని ఓ ట్వీట్‌లో ప్రధాని పేర్కొన్నారు. ప్రతి ఏటా సెప్టెంబర్ 14న హిందీ భాషా దినోత్సవంగా జరుపుతున్నారు. దేశ అధికార భాషగా హిందీని రాజ్యాంగంలో చేర్చిన రోజును గుర్తు చేసుకుంటు హిందీ దివస్‌ పాటిస్తుంటారు. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో హిందీ నాలుగో స్థానంలో ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/