హైదరాబాద్‌కు చేరుకున్న ఖర్గే.. కాంగ్రెస్ నేతలతో భేటీ

mallikarjuna-kharge-to-meet-pcc-leaders-in-hyderabad

హైదరాబాద్ః ఏఐసీసీ అధ్యక్ష స్థానం కోసం పోటీ చేస్తున్న పార్టీ సీనియర్‌ నేత మల్లిఖార్జున ఖర్గే హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఖర్గేకు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు స్వాగతం పలికారు. గాంధీభవన్‌లో పీసీసీ ప్రతినిధులతో ఆయన సమావేశం కానున్నారు. ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని రాష్ట్ర నేతలను ఖర్గే కోరారు. తెలంగాణలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇద్దరు చొప్పున 238 మంది ప్రతినిధులు ఏఐసీసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈనెల 18న కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు పోలింగ్‌ జరగనుంది. 2002 తర్వాత తొలిసారి ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికకు ఓటింగ్ నిర్వహించనున్నారు. సీనియ‌ర్ నాయ‌కులు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే, శ‌శిథ‌రూర్ ప్ర‌ధాన అభ్య‌ర్థులుగా పోటీలో ఉన్నారు. ప్ర‌చారం జోరందుకుంది. కానీ, గాంధీల కుటుంబం మ‌ద్ద‌తు మాత్రం ఖ‌ర్గేకు ఉన్న‌ద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది.

కాగా, నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 8 వరకు సమయం ఉంది. ఆ తర్వాత బరిలో ఉండేది ఎవరో తేలిపోనుంది. అక్టోబర్ 8న సాయంత్రం పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను వెల్లడించనున్నారు. థరూర్, ఖర్గేలలో ఎవరు నామినేషన్లు ఉపసంహరించుకోకపోతే అక్టోబర్ 17న ఎన్నికలు నిర్వహిస్తారు. 9వేలకు పైగా ఉన్న కాంగ్రెస్ సభ్యులు ఎన్నికల్లో ఓటేస్తారు. అక్టోబర్ 19న కౌంటింగ్ ఉంటుంది. అదేరోజు విజేతను ప్రకటిస్తారు. మరోవైపు, మిస్త్రీ ప్రకటన తర్వాత ట్వీట్ చేసిన థరూర్.. స్నేహపూర్వక పోటీకి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రజాస్వామ్యయుత ప్రక్రియ పార్టీకి, నేతలకు ప్రయోజనం కలిగిస్తుందని అన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/