రక్షాబంధన్ సందర్భంగా మహిళలతో కేటీఆర్ ఇంటరాక్ట్ ..

రక్షాబంధన్ సందర్భంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మహిళల భద్రతకు షీటీమ్ లు తీసుకొచ్చామని , మహిళలకు రాజకీయ అవకాశం కల్పించడమే లక్ష్యంగా 50శాతం రిజర్వేషన్లు కల్పించామని..అమ్మఒడి, కేసీఆర్ కిట్ సహా ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ, ఆశాకార్యకర్తలను ఆదుకుంటున్నట్లు తెలిపారు.

33 జిల్లాలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన కేటీఆర్.. ఏ రాష్ట్రంలో చేయని అభివృవద్ధిని తెలంగాణలో చేస్తున్నామన్నారు. బాలికల గురుకులాలు, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేశామని , కేంద్రం నిధులు ఇవ్వకున్నా సొంత నిధులతో పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. రెండు వందల పెన్షన్ను 2వేలకు పెంచామని..4 లక్షల మంది బీడీ కార్మికులకు పెన్షన్ అందజేస్తున్నామని తెలిపారు. అగస్ట్ 15 నుంచి 57ఏళ్లు నిండిన అర్హులకు కొత్త పెన్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు.