కరీంనగర్ లో టీటీడీ ఆలయానికి భూమి పూజ ప్రారంభం..

తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణానికి సంబదించిన భూమి పూజ ప్రారంభమైంది. తిరుమల నుంచి వచ్చిన వేదపండితుల సమక్షంలో ఆగమ శాస్త్ర ఆచారాల ప్రకారం భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, టీటీడీ టెంపుల్ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, కలెక్టర్ కర్ణన్ పాల్గొన్నారు.

సాయంత్రం నాలుగు గంటలకు మంకమ్మ తోట వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి ప్రతిపాదిత టిటిడి క్షేత్ర నిర్మాణ స్థలం వరకు సారెతో శోభాయాత్ర జరుగనుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పద్మనగర్ లో కేటాయించిన 10 ఎకరాల స్థలంలో టీటీడీ ఆధ్వర్యంలో వెంకన్న గుడి నిర్మిస్తున్నారు.