మళ్లీ పెళ్లి ట్రైలర్ టాక్ : ఎప్పుడు లేస్తుందో ఎప్పుడు పడుతుందో..

సీనియర్ హీరో నరేష్ నుండి వస్తున్న సినిమా మళ్ళీ పెళ్లి. పవిత్ర లోకేష్‌తో కలిసి గత కొంతకాలంగా నరేష్ సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఇద్దరూ కలిసి మళ్ళీ పెళ్లి అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ నెల 26న తెలుగు, కన్నడ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదలైంది.

“తెలుగు ఇండస్ట్రీ కన్నడపై చూపు తిప్పిందేంటి..” అనే వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ స్టార్ట్ అయింది. ట్రైలర్ లో నరేష్ పవిత్రాల పరిచయం..ఆ తర్వాత దారితీసిన సన్నివేశాలు , నరేష్ రెండు పెళ్లిలా ప్రస్తావన ఇలా అన్ని చూపించారు.

‘అయినా పెళ్లయిన ఆవిడతో మీకు లవ్ ఏంటి సర్.. మీది పడి పడక లేచే వయసు.. ఎప్పుడు లేస్తుందో.. ఎప్పుడు పడుతుందో..’ అంటూ డబుల్ మీనింగ్ డైలాగులు కూడా గట్టిగానే వాడారు. మరోవైపు పవిత్ర లైఫ్‌ను కూడా సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తుంది. “ఇద్దరూ ఒకే గదిలో ఉంటున్నా.. నా కోరికలు తీర్చుకోవడానికి ఐదు సంవత్సరాలు పట్టింది..” అని పవిత్రతో తన భర్త అంటే “అయినా నీ కోరికలతో నాకు పనేంటి.. నాకు పుట్టాలి కదా..” అంటూ పవిత్ర చెప్పింది. ఇక తమ రిలేషన్ గురించి మీడియా అడిగిన ప్రశ్నలు.. వాటికి నరేశ్ ఏం ఆలోచించారు అన్నది కూడా ట్రైలర్‌లో చూపించారు. ఓవరాల్ గా ట్రైలర్ తో సినిమా ఫై ఆసక్తి పెంచారు.

విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నరేష్ స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారట. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తుండటం మరో విశేషం. సురేష్ బొమ్మిలి సంగీతం అందిస్తున్నారు.

YouTube video