ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ టాక్ : ఈ సారి పర్ఫార్మెన్స్ బద్ధలే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కలయికలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్ మూవీ తర్వాత మరోసారి వీరిద్దరి కలయికలో సినిమా వస్తుండడం తో అభిమానుల అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా..ఈ మూవీ తాలూకా ఫస్ట్ గ్లింప్స్ అభిమానుల్లో పూనకాలు పుట్టించాయి. గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ నేటితో పదకొండేళ్లు పూర్తి అవుతున్నందున తాజా సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గ్లింప్స్ ను విడుదల చేసింది మేకర్స్.

పాతబస్తీలో పోలీస్ అధికారిగా పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. లుంగీ కట్టిన పవన్ కల్యాణ్.. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్ధలైపోతుంది అని చెప్పే డైలాగ్ హైలెట్ గా నిలిచింది. అయితే ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో.. అధర్మము వృద్ధిన ఉండునో.. ఆయా సమయముల అందు ప్రతి యుగమున అవతారాము దాల్చుచున్నానంటూ ఘంటసాల వాయిస్ ఓవర్ తో ఈ గ్లింప్స్ ప్రారంభం అవుతుంది.

ఆ తర్వాత లుంగీ కట్టుకొని వెనక గన్ దోపుకొని చాయ్ చేత పట్టుకుని పవన్ ఎంట్రీ ఇస్తాడు. భగత్.. భగత్ సింగ్.. మహంకాళి పోలీస్ స్టేషన్ అఫ్జల్ గంజ్ పాతబస్తీ అంటూ పవన్ కల్యాణ్ కనిపిస్తాడు. ఊర మాస్ లుక్ లో కనిపించాడు. వాకింగ్ స్టైల్ కళ్లజోడు పెట్టుకొని చేతులు ఊపే స్టైల్ అదిరింది. లాస్ట్ షాట్ అయితే మరింత అదిరిపోయింది. ఈ గ్లింప్స్ చూస్తుంటేనే సినిమా అదిరిపోనుందని అర్థం అవుతోంది.

ఇక ఈ మూవీ లో పవన్ సరసన శ్రీలీల నటిస్తుంది. అలాగే నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర , గిరి , టెంపర్ వంశీ, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అశుతోష్ రాణా, గౌతమి నాగ, మహేష్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా , అయనంకా బోస్ సినిమాటోగ్రాఫర్ , ఆర్ట్ డైరెక్టర్ గా ఆనంద్ సాయి , చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

YouTube video