భారీ వర్షాలు, వరదల కారణంగా 15 రైళ్లు , 34 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు – దక్షిణ మధ్య రైల్వే

భారీ వర్షాలు , వరదల కారణంగా రేపటి నుండి (జులై 14) 15 రైళ్లు , 34 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్, ఉందానగర్, మేడ్చల్, బొల్లారం స్టేషన్ల మధ్య నడిచే పలు రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్ – ఉందానగర్ – సికింద్రాబాద్ ప్రత్యేక ప్యాసింజర్ రైలు, సికింద్రాబాద్ – ఉందానగర్ మెము ప్రత్యేక రైలు, హెచ్ఎస్ నాందేడ్ – మేడ్చల్ – హెచ్ఎస్ నాందేడ్ ప్యాసింజర్ రైలు రద్దు అయింది. సికింద్రాబాద్ – మేడ్చల్ – సికింద్రాబాద్ మెము రైలు, సికింద్రాబాద్ – బొల్లారం – సికింద్రాబాద్ మెము రైలను కూడా రద్దు చేశారు. అలాగే కాకినాడ పోర్టు- విజయవాడ స్టేషన్ల మధ్యలో నడిచే రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
ఈనెల 14 నుంచి 17 వరకు 34 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. లింగంపల్లి-హైదరాబాద్ రూట్‌లో 9 సర్వీసులు, హైదరాబాగ్-లింగంపల్లి మార్గంలో 9, ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య 7 సర్వీసులు, లింగంపల్లి -ఫలక్‌నుమా రూట్‌లో 7 సర్వీసులు, సికింద్రాబాద్-లింగంపల్లి రూట్‌లో ఒకటి, లింగంపల్లి సికింద్రాబాద్ మార్గంలో ఒక సర్వీసు రద్దు చేశారు.
గత వారం రోజులుగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా వాతావరణ శాఖ మరో మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలపడంతో తెలంగాణ విద్యాసంస్థలకు ఇచ్చిన సెలవులను మరో మూడు రోజులు పొడగించింది తెలంగాణ ప్రభుత్వం.