బండి సంజయ్‌కు మంత్రి మల్లారెడ్డి ఛాలెంజ్

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కి..బిఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి ఛాలెంజ్ విసిరారు. ప్రస్తుతం తెలంగాణ లో బిఆర్ఎస్ ..బిజెపి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి మల్లారెడ్డి..సంక్షేమ పథకాలు, అభివృద్ధికి సంబంధించి బండి సంజయ్‌కు ఆయన సవాల్ విసిరారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లాంటివి ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్లు చూపిస్తే మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏ రాష్ట్రానికి రమ్మన్నా తాను వస్తానని, తెలంగాణలో రైతులకు ప్రభుత్వం చేస్తున్నంత మేలు ఏ రాష్ట్రంలోనైనా చేస్తున్నట్లు చూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.10 వేల రైతుబంధు, రూ.5 లక్షల రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు అందిస్తున్నారని మల్లారెడ్డి తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో రైతుల కోసం తెలంగాణలో చేసినట్లు చేస్తున్నారా? అని మల్లారెడ్డి ప్రశ్నించారు.