‘దాస్ క దమ్కీ’ నుండి ఆల్ మోస్ట్ పడిపోయిందే పిల్లా సాంగ్ రిలీజ్

ఓరి దేవుడా అంటూ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో విశ్వక్ సేన్..ఇప్పుడు ‘దమ్కీ’ అంటూ రాబోతున్నాడు. స్వీయ దర్శకత్వంలో ..కామెడీ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ చిత్రానికి బెజవాడ ప్రసన్నకుమార్ కథని సమకూరుస్తున్నాడు. ఇటీవలే బాలకృష్ణ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఇప్పుడు ఈ చిత్రంలోని ఆల్ మోస్ట్ పడిపోయిందే పిల్లా అంటూ సాగే వీడియో సాంగ్ ను రిలీజ్ చేసారు మేకర్స్. వీడియో సాంగ్ లో హీరోయిన్ నివేధా పేతురాజ్ హాట్ హాట్ అందాలు చూపించడంతో పాటు విశ్వక్ సేన్ యొక్క డాన్స్ మరియు మ్యాన్లీ నెస్ తో అలరిస్తున్నాడు.

వీడియో సాంగ్ విడుదల అయిన తర్వాత దాస్ క దమ్కీ సినిమా పై అంచనాలు మరింతగా పెరిగాయి అనడంలో సందేహం లేదు. ఈ సినిమా కు విడుదలకు ముందే పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వడంతో కచ్చితంగా డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ మూవీ ని తెలుగు, తమిళ ,మలయాళ , హిందీ భాషల్లో ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో విష్వక్సేన్ సరసన నాయికగా నివేదా పేతురాజ్ అలరించనుంది. ఇతర ముఖ్యమైన పాత్రలలో రావు రమేశ్ .. రోహిణి .. అజయ్ కనిపించనున్నారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు.

YouTube video