మా బావ ప్రోమో అదిరింది

Veera Simha Reddy – Maa Bava Manobhavalu Promo

వీర సింహ రెడ్డి నుండి వచ్చిన మా బావ మనోభావాలు ప్రోమో అదిరింది. నందమూరి బాలకృష్ణ , శృతి హాసన్ జంటగా తెరకెక్కుతున్న మూవీ వీరసింహారెడ్డి. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మూవీ జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా తాలూకా పోస్టర్స్ , టీజర్స్ , సాంగ్స్ ఇలా అన్ని సినిమా ఫై అంచనాలు పెంచేయగా..తాజాగా సినిమాలోని ”మా బావ మనోభవాలు” అంటూ సాగే మూడో సాంగ్ ప్రోమో శుక్రవారం రిలీజ్ చేశారు.

బాలయ్య బాబు తో పాటు చంద్రిక రవి డ్యాన్స్ స్టెప్పులు కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తప్పకుండా ఈ సాంగ్ అయితే థియేటర్లో దద్దరిల్లిపోతుంది అని అర్థమవుతోంది. ఈ ఫుల్ సాంగ్ ఈరోజు సాయంత్రం రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ లో క‌న్న‌డ యాక్ట‌ర్ దునియా విజ‌య్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఎస్ఎస్‌. థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత బాల‌కృష్ణ.. అనీల్ రావిపూడితో ఓ యాక్ష‌న్ సినిమా చేయ‌నున్నాడు. ఫాద‌ర్‌-డాట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో ‘పెళ్ళిసంద‌D’ ఫేం శ్రీలీలా, బాల‌కృష్ణ‌కు కూతురిగా న‌టిస్తుంది.

YouTube video