దేశంలో 129కి చేరిన కరోనా బాధితులు

ఒక్కరోజే 19 కరోనా కేసులు నమోదు

Coronavirus cases in India
Coronavirus cases in India

న్యూఢిల్లీ: దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. నిన్న ఒక్కరోజు 19 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 129కి చేరింది. కర్ణాటకలో మొత్తం 10 మందికి కరోనా సోకినట్లు ఆరోగ్య శాఖ ఈ రోజు ప్రకటన చేసింది. ఇటీవలే యూకే నుంచి వచ్చిన 20 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా చర్యలు తీసుకుంటున్నారు. చైనాలో పుట్టుకొచ్చిన కరోనా కొవిడ్‌19 వైరస్‌ ఇప్పటివరకు 162 దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా 1,82,547 కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కారణంగా 7,164 మంది మృతి చెందారు. చైనాలో 3,226, ఇటలీలో 2,158, స్పెయిన్‌లో 342 మంది ప్రాణాలు కోల్పోయారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/