శరీర వేడి తగ్గించేందుకు

ఆరోగ్యం-సంరక్షణ

Reduce body heat
Reduce body heat

ప్రతిమనిషి జీవిత కాలంలో ఏదో ఒక సందర్భంలో తప్పనిసరిగా వేడి ప్రభావానికి గురి అవుతుంటారు.

ఒక్కొక్కరి శరీరం ఒక్కో విధంగా ఉంటుంది. కొంత మంది శరీరంలో సాధారణంగా ఉంటే, కొందరి శరీరం చల్లగా ఉంటుంది.

మరికొందరికి తీవ్రమైన వేడి ఉంటుంది. శరీరంలో రసాయనాల అసమతుల్యత ఉంటుంది. ఇది సాధారణ జీవక్రియను ప్రభావితం చేస్తుంది.

ఇది చర్మంలో మొటిమలు, గుండెల్లో మంట, దద్దుర్లు, విరేచనాలు కలిగిస్తుంది. డీప్‌ ఫ్రైడ్‌ ఫుడ్స్‌ శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి.

మజ్జిగ, మస్క్‌మెలన్‌ ఎక్కువగా తీసుకుంటే శరీర ఉష్ణోగ్రతను తగ్గించగలవు. తులసి గింజలతో చల్లటి నీరు తాగాలి. ఈ గింజలను పాలలో కూడా వేసుకుని తాగవచ్చు.

ప్రాణాయామం, సూర్య నమస్కారం, త్రయంగన యోగాసనాలు శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు తోడ్పడతాయి.

కొత్తిమీర, జీలకర్ర, సోంపుతో తయారుచేసిన టీ జీవక్రియకు ఉపశమనం కలిగిస్తుంది.

శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. చమోలిలే, పిప్పరమెంట్‌ టీ కూడా ఇందుకు సహాయపడుతుంది. రక్తప్రసరణ మెరుగుపరచడానికి, శరీరాన్ని ఉపశమింపచేసేందుకు మూలికా నూనెలతో శరీరాన్ని మసాజ్‌ చేసుకోవాలి.

ఇందుకు కొబ్బరినూనె బాగా పనిచేస్తుంది. సిమ్మింగ్‌ చేయడం కూడా మంచిది. వేడి శరీరం ఉన్నవారు లేత రంగు దుస్తులు ధరిస్తే మంచిది.

యాలుకులు నీటిలో ఉడికించి ఆ నీటిని చల్లబరిచి క్రమం తప్పకుండా తాగాలి.

మెంతులు ఉష్ణోగ్రత ప్రభావాన్ని ఎదుర్కోవడానికి అత్యంత ఆదర్శవంతమైన పరిష్కారం. ఒక టేబుల్‌ స్పూన్‌ మెంతులు గ్లాసు నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తాగాలి.

కొబ్బరినీళ్లలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.

ఉష్ణోగ్రతను తగ్గించడంలో హాయపడటమే గాక శరీర నీటి లోపాన్ని తగ్గిస్తుంది. శరీరం బలంగా, మృదువుగా ఉంటేందుకు తోడ్పడుతుంది.

ఒక గ్లాసు బాదం పాలల్లో చిటికెడు పసుపు కలిపి తీసుకోవచ్చు. ఉప్పు, కారం ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ప్రాసెస్‌, ఫాస్ట్‌ఫుడ్‌ను విస్మరించాలి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/