యశోద హాస్పటల్ లో #SS28 షూటింగ్

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో హ్యాట్రిక్ మూవీ #SS28 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా షూటింగ్ ప్రారంభం కాగా..ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ చిత్రంలోని కొన్ని హాస్పటల్ సన్నివేశాలను హైదరాబాద్ లోని యశోద హాస్పటల్ లో షూట్ చేస్తున్నారు. మహేష్ , పూజా హగ్దే ల ఫై ఈ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సెట్స్ వేసి చిత్రీక‌రించటం కంటే.. ఇలా చేస్తే బెట‌ర్ అని మేక‌ర్స్ అనుకుని హైటెక్ సిటీలోని య‌శోద హాస్పిట‌ల్‌లో స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

అత‌డు, ఖ‌లేజా చిత్రాల త‌ర్వాత మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో SSMB 28 రూపొందుతోంది. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ఏడాది ఆగ‌స్ట్ 11న విడుద‌ల చేస్తామ‌ని ఇప్ప‌టికే నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం మ‌హేష్ ఫుల్ స్టైలిష్ అండ్ సిక్స్ ప్యాక్ లుక్‌లో క‌నిపించ‌బోతున్నారు.