మాజీ క్రికెటర్ వసంత్ రాయ్ మృతి
ఇటీవలే శత జన్మదినోత్సవం జరుపుకున్న రాయ్

Mumbai: భారత తొలితరం ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ వసంత్ రాయ్ ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన ఇటీవలే శత జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు.
రాయ్ కి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చార్టెడ్ అకౌంటెంట్ అయిన వసంత్ రాయ్ క్రికెట్‌పైనా మక్కువ చూపారు. 1939లో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా జట్టు తరఫున అరంగేట్రం చేశారు.
1940వ దశకంలో ముంబై, బరోడా జట్లకు ప్రాతినిధ్యం వహించారు. కుడిచేతి వాటమున్న బ్యాట్స్‌మెన్ అయిన రాయ్ మొత్తం తొమ్మిది ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 277 పరుగులు సాధించారు.
68 రన్స్ కెరీర్లో బెస్ట్ స్కోర్. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత అనేక రచనలు చేసి, క్రికెట్ చరిత్రకారుడిగా గుర్తింపు పొందారు.

ఇటీవల జరిగిన రాయ్ శత జయంతికి ఇండియన్ క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, ఆస్టేలియా మాజీ ఆటగాడు స్టీవ్‌వా ముంబైలోని ఆయన ఇంటికెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో దిగిన ఫొటోను సచిన్ ట్విట్టర్లో కూడా పెట్టాడు.
క్రికెట్‌కు సంబంధించి గతకాలపు విషయాలను ఆయన దగ్గర ఆసక్తికరంగా విన్నామని ట్వీట్ చేశాడు.
కాగా, రాయ్ అంత్యక్రియలు దక్షిణ ముంబైలోని చందన్‌వాడీ శ్మశాన వాటికలో ఈ రోజు సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/