తేజ అహింస మూవీ టాక్

చిత్రం , జయం , నువ్వు నేను వంటి సూపర్ హిట్ చిత్రాలతో యూత్ ను ఆకట్టుకున్న తేజ..ఆ తర్వాత వరుస డిజాస్టర్లతో కనుమరుగయ్యారు. ఆ మధ్య రానా తో నేనే రాజు నేనే మంత్రి మూవీ తో సూపర్ హిట్ కొట్టి మళ్లీ వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత బెల్లం కొండ శ్రీను తో సీత చేసి మరో ప్లాప్ కొట్టాడు. తాజాగా ఇప్పుడు దగ్గుపాటి అభిరాం ను ఇండస్ట్రీ కి హీరోగా పరిచయం చేస్తూ అహింస అనే మూవీ చేసాడు. ఈ మూవీ ఈరోజు (జూన్ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక ఈ మూవీ ఎలా ఉందనేది ఆడియన్స్ టాక్ ద్వారా చూస్తే.. తేజ తెర‌కెక్కించిన ప్రేమ క‌థా చిత్రాల్లో డ‌బ్బున్న వ్య‌క్తికి, డ‌బ్బు లేని వ్య‌క్తికి మ‌ధ్య పోరాటం ఉంటుంది. దాన్ని క‌థానాయ‌కుడు ఎలా అధిగ‌మించి విజ‌యం సాధించాడ‌నే కాన్సెప్ట్‌తోనే ఆయన సినిమాలుంటాయి. ఈ సినిమా కూడా అదే తరహాలో ఉండడం తో సినిమా కు నెగిటివ్ టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. పాత కథ, అంతనకన్నా పాత స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు. సినిమాలో చాలా సీన్స్ జయం, నువ్వు నేను సినిమాలను గుర్తుచేస్తాయి. ఇక లాజిక్కుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. సినిమా మొత్తం సాగాదీతగా ఉంటుంది.

మొదటి సినిమా కాబట్టి అభిరామ్‌ పరవాలేదనిపించాడు. కథలో కొత్తదనం లేదు కాబట్టి నటనకు కూడా పెద్ద స్కోప్ లేకుండాపోయింది. అయినప్పటికీ నటనలో చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఇక అహల్యగా నటించిన హీరోయిన్ గీతికా తివారి పరవాలేదనిపించింది. పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌మ‌ల్ కామ‌రాజు, లాయ‌ర్‌గా స‌దా పాత్రలకు న్యాయం చేశారు. విల‌న్‌గా న‌టించిన ర‌జ‌త్ బేడి, ఛటర్జీ పాత్ర పోషించిన వ్యక్తి నటన కూడా ఓకే అనిపించింది. ఓవరాల్ గా సినిమా కు మాత్రం నెగిటివ్ టాక్ ఎక్కువగా వినిపిస్తుంది.