సైమా అవార్డ్స్ 2021 : ఉత్తమ నటుడిగా సైమా అవార్డు అందుకున్న మహేష్ బాబు

సైమా అవార్డ్స్ 2021 : ఉత్తమ నటుడిగా సైమా అవార్డు అందుకున్న మహేష్ బాబు

సినీ స్టార్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే సైమా అవార్డ్స్ వేడుక హైదరాబాద్ లో అట్టహాసంగా జరుగుతుంది. 2019 కు గాను సైమా అవార్డ్స్ అందజేయబోతుంది. వాస్తవానికి గత ఏడాది ఈ అవార్డ్స్ వేడుక జరగాల్సి ఉండగా..కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. ఈ ఏడాది కూడా ఉంటుందో ఉండదో అని అంత భావిస్తున్న వేళా సైమా అవార్డ్స్ వేడుక జరగడం ఆనందాన్ని నింపుతుంది.

రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడకు చెందిన సినీ పరిశ్రమలకు అవార్డులు ప్రకటించనున్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి నాలుగు భాషలకు చెందిన సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఇందులో సైమా ఉత్తమ చిత్రంగా ‘జెర్సీ’ అవార్డు గెలుచుకోగా.. సూపర్‌స్టార్‌ మహేష్ బాబు ‘మహర్షి’ (2019) సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు.

మిగతా అవార్డ్స్ చూస్తే..

  • 2019లో ఉత్తమ నటుడిగా మహేశ్ బాబు (మహర్షి)
  • మహర్షి చిత్రంలో ‘ఇదే కదా..’ పాటకు ఉత్తమ గీత రచయితగా శ్రీమణి.
  • మజిలి చిత్రానికి గాను ‘ప్రియతమ ప్రియతమ’ పాటకు ఉత్తమ గాయనిగా చిన్మయి శ్రీపాదకు పురస్కారం.
  • ఇస్మార్ట్ శంకర్ లో టైటిల్ సాంగ్ ఆలపించిన అనురాగ్ కులకర్ణికి ఉత్తమ గాయకుడిగా అవార్డు.
  • శివాత్మిక రాజశేఖర్ కు బెస్ట్ డెబ్యూ అవార్డు.
  • బెస్ట్ డెబ్యూ మేల్ కేటగిరీలో కోడూరి శ్రీసింహాకు అవార్డు.
  • ‘మత్తు వదలరా’ చిత్రానికి గాను పురస్కారం.
  • ఏజెంట్ సాయి శ్రీనివాస్ చిత్రానికి గాను బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా స్వరూప్ కు అవార్డు.

టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు, సీనియర్ నటుడు మురళీమోహన్, యువ నటుడు కార్తికేయ, సీనియర్ నటి జీవిత తదితరులు సైమా వేడుకలో సందడి చేశారు.