బిల్‌ గేట్స్‌ ను ను కలిసిన సూపర్ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు..మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్ ను కలిశారు. రీసెంట్ గా సర్కార్ వారి పాట తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్..ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో మహేష్ , నమ్రతలు మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌ ను కలిశారు. ఈ మేరకు తన సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశాడు మహేష్‌ బాబు. ప్రపంచంలో చాలా ముఖ్య మైన వ్యక్తి మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌. ఆయనను కలవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం వీరి ఫోటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

చిత్ర పరిశ్రమలో చాలా అందమైన జంట అంటే మహేష్‌ బాబు – నమ్రతదే అని చెప్పాలిన పనిలేదు. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. టక్కరి దొంగ సినిమాలో నమ్రత – మహేష్‌ బాబు ఇద్దరూ నటించారు. ఆ సినిమా సమయంలోనే మహేష్‌ బాబు -నమ్రత ఇద్దరూ లవ్‌ లో పడ్డారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుని.. ఇద్దరికి జన్మనించారు. ఇప్పటి వరకు ఎలాంటి గొడవలు లేకుండా.. వారు జీవితాన్ని కొనసాగిస్తున్నారు. సినిమాలతో ఎంత బిజీ గా ఉన్నప్పటికీ ..షూటింగ్ లో కాస్త గ్యాప్ దొరికితే కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్తుంటాడు మహేష్. ఎక్కువగా ఫ్యామిలీ తో గడిపేందుకే మహేష్ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ఇక పిల్లలు గౌతమ్ , సితారలు కూడా యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా సితార అయితే ఇప్పటి నుండే తనకంటూ అభిమానులను సొంతం చేసుకోవడం విశేషం. సోషల్ మీడియా లో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను అలరిస్తుంటుంది. మహేష్ నటించిన సర్కారు వారి పాట ప్రమోషన్ సాంగ్ లో సితార డాన్స్ తో ఆకట్టుకుంది.