కేసీఆర్ ఫై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం

బిఆర్ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్ ఫై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. టిఆర్ఎస్ ను కాస్త బిఆర్ఎస్ విస్తరించిన కేసీఆర్..ప్రస్తుతం ఫోకస్ అంత మహారాష్ట్ర ఫై పెట్టారు. ఇప్పటీకే మహారాష్ట్రలో రెండుసార్లు భారీ సభలు ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో అక్కడి నేతలను పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే బిఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు , రాబోయే రోజుల్లో ఎలాంటి అభివృద్ధి చేయబోతుంది..ప్రజల కోసం ఎలాంటి పనులు చేయబోతున్నారనేది క్లియర్ చెపుతూ వచ్చారు. ఈ క్రమంలో కేసీఆర్ కొత్త రాజకీయ ప్రస్థానం, ఆయన నాయకత్వంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ స్పందించారు.

దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు కేసీఆర్ ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నానని చవాన్ తెలిపారు. కేసీఆర్ వ్యూహాలు అర్థం కావడం లేదని అన్నారు. ఇక రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని కేసీఆర్ ఖండించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై చవాన్ స్పందిస్తూ… రాహుల్ పై వేటు వేయడాన్ని కేసీఆర్ ఖండించారని… దీన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. బీజేపీని కట్టడి చేయడానికి విపక్షాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు.