నడవలేని స్థితిలో విజయ్ కాంత్

తమిళ నటుడు , డీఎండీకే పార్టీ అధినేత విజయ్ కాంత్ ప్రస్తుతం నడవలేని స్థితి లో ఉన్నాడు. చాలా కాలంగా డయాబెటిస్ తో బాధపడుతున్న ఈయన.. ఈ కారణంతో మూడు వేళ్లను డాక్టర్లు తొలగించారు. ప్రస్తుతం ఆయన నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన ఆరోగ్యం బాగా క్షీణించినట్టు ఆయన్ను చూస్తే తెలుస్తుంది. తాజాగా విజయకాంత్ దంపతులను తమిళ సూపర్ స్టార్ విజయ్ తండ్రి, కోలీవుడ్ సీనియర్ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ కలిసి పరామర్శించారు.

విజయకాంత్ ను కలిసిన ఫొటోలను చంద్రశేఖర్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో పలు చిత్రాలు వచ్చాయి. 1971లో విజయకాంత్ కథానాయకుడిగా ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. చంద్రశేఖర్ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో 70కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇక విషయకాంత్ విషయానికి వస్తే 70 ఏళ్ల విజయకాంత్ తమిళ సినీ పరిశ్రమలో తనదైన ముద్రను వేశారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో సైతం అడుగుపెట్టి… డీఎండీకే పార్టీని స్థాపించారు.